నమస్తే శేరిలింగంపల్లి: భారతదేశంలో ప్రతీ హిందువు సనాతన ధర్మ పరిరక్షణకు పాటు పడాలని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం ఉపాధ్యక్షులు బేరి రామచందర్ యాదవ్ అన్నారు. అలంపూర్ జోగులాంబ అమ్మవారిని దర్శించుకున్నఆయన ఆలయ కమిటీ సభ్యులతో కలిసి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రామ్ చందర్ యాదవ్ మాట్లాడుతూ భారతీయులందరూ ప్రతి ఒక్కరూఐక్యమత్యంతో భారతదేశం గొప్పతనం నీ చాటి చెప్పాలన్నారు అని అన్నారు. అమ్మవార్ల కరుణా కటాక్షాలు అందరిమీద ఉండాలని అందరూ ఆయురారోగ్యాలతో సుఖ సంతోషాలతో జీవించాలని కోరినట్లు తెలిపారు. ఈ సందర్భంగా బాల బ్రహ్మేశ్వర దేవస్థానం దేవస్థానం చైర్మన్ ఈ రవి ప్రకాష్ గౌడ్ బేరి రామచందర్ యాదవ్ ను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో నాయకులు కే అశోక్ యాదవ్, బేరి శ్రీనివాస్ యాదవ్, ఆలయ మాజీ ధర్మకర్త బుజ్జి యాదవ్, రఘు యాదవ్, చిన్న స్వామి యాదవ్, ఈదన్న యాదవ్, భాస్కర్ యాదవ్, వీరారెడ్డి., శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
