నమస్తే శేరిలింగంపల్లి : గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టి.ఎన్.జి.ఓ’స్’ కాలనీలో నెలకొన్న సమస్యలను కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ జగదీశ్వర్ గౌడ్ పరిశీలించారు.
గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని టి.ఎన్.జి.ఓ’స్’ కాలనీలో పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను పరిశీలించారు. అనంతరం కాలనీ అసోసియేషన్ సభ్యులతో కలిసి కాలనీ అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అసోసియేషన్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు.