చందానగర్, (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ రాష్ట్రంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో చందానగర్ డివిజన్ లోని పట్టభద్రులు కొత్తగా ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలని టిఆర్ఎస్ యువనేత మిరియాల ప్రీతమ్ కోరారు. డివిజన్ పరిధిలోని చందానగర్, రాజీవ్ నగర్ కాలనీలలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న వారికి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటర్ నమోదు పై అవగాహన కనిపించడంతో పాటు, ఫామ్- 18 ను నింపి మిరియాల ప్రీతమ్ గారికి అందజేశారు. ఈ సందర్భంగా ప్రీతమ్ గారు మాట్లాడుతూ హైదరాబాద్, రంగారెడ్డి , మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. ప్రతి కాలనీలో పట్టభద్రులకు ఓటర్ నమోదు పై అవగాహన కల్పించి పెద్ద సంఖ్యలో ఓటర్లుగా నమోదు చేపియడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో త్రినాథ్, జి కృష్ణ, విశాల్, హర్ష, టి కృష్ణ, శ్రీరామ్, అభిరామ్, సంజయ్, పి రాంబాబు తదితరులు పాల్గొన్నారు.