- ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ
చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని చందానగర్ ప్రధాన రహదారిపై విజేత సూపర్ మార్కెట్ ఎదురుగా నూతనంగా నిర్మిస్తున్న ఫుట్ ఓవర్ బ్రిడ్జి (పాదచారులు వంతెన) నిర్మాణ పనులను స్థానిక కార్పొరేటర్ బొబ్బ నవతా రెడ్డి, జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పాదచారుల వంతెన నిర్మాణ పనులను వేగంగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలన్నారు. నియోజకవర్గంలో అవసరం ఉన్న ప్రాంతాల్లో ఫుట్ ఓవర్ బ్రిడ్జిలను నిర్మిస్తామని తెలిపారు.

ఈ కార్యక్రమంలో డీఈ రూపా దేవి, ఏఈ అనురాగ్, వర్క్ ఇన్‌స్పెక్టర్లు జగదీష్, శ్రీధర్, మాజీ కౌన్సిలర్లు రఘుపతి రెడ్డి, రాఘవేంద్ర రావు, రవీందర్ రావు, మోహన్ గౌడ్, సునీత రెడ్డి, మాజీ కార్పొరేటర్ అశోక్ గౌడ్, డివిజన్ తెరాస అధ్యక్షుడు రఘునాథ్ రెడ్డి, మియాపూర్ డివిజన్ అధ్యక్షుడు ఉప్పలపాటి శ్రీకాంత్, శేరిలింగంపల్లి డివిజన్ అధ్యక్షుడు మారబోయిన రాజు యాదవ్, తెరాస నాయకులు మిరియాల రాఘవరావు, దాసరి గోపి, జెరిపాటి రాజు, జనార్దన్ రెడ్డి, ప్రవీణ్, మిరియాల ప్రీతమ్, అక్బర్ ఖాన్, వెంకటేశ్వర్లు, గురుచరణ్ దూబే, కృష్ణ దాస్ తదితరులు పాల్గొన్నారు.





