ప్రభుత్వ భూములు, చెరువు తూములు, నాలాల్లో అనుమతులను రద్దు చేయండి:క‌సిరెడ్డి

జోన‌ల్ క‌మిష‌న‌ర్ ర‌వికిర‌ణ్‌కు ఫిర్యాదు ప‌త్రం అంద‌జేస్తున్న క‌సిరెడ్డి భాస్క‌ర రెడ్డి

– జోన‌ల్ క‌మిష‌న‌ర్‌, ఉప‌క‌మిష‌న‌ర్‌ల‌కు జ‌నంకోసం అధ్య‌క్షుడు క‌సిరెడ్డి భాస్క‌ర్‌రెడ్డి ఫిర్యాదు
చందాన‌గ‌ర్ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): ప్రభుత్వ భూములు, చెరువు తూములు, నాళాల్లో అనుమతులను రద్దు చేసి కాలనీలను ముంపు నుండి కాపాడాలని కోరుతూ జ‌నంకోసం అధ్య‌క్షుడు క‌సిరెడ్డి భాస్క‌ర రెడ్డి జోనల్ కమీషనర్ రవికిరణ్, అసిస్టెంట్ సిటీ ప్లానర్ శ్రీనివాస్ రావు లకు మంగ‌ళ‌వారం ఫిర్యాదు చేశారు. కాగా జోనల్ కమీషనర్ ర‌వికిర‌ణ్ సానుకూలంగా స్పందించార‌ని కఠిన చర్యలు తీసుకోవాలని టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ కు ఆదేశించార‌ని క‌సిరెడ్డి తెలిపారు. మియాపూర్ 28, 44, 100, 101 లలో ఇచ్చిన అనుమతులను రద్దు చేస్తామని తెలిపిన‌ట్టు ఆయ‌న అన్నారు. ఇకముందు దీప్తిశ్రీనగర్ బై నెంబర్ లపై ఎలాంటి అనుమతులు ఇవ్వబడవని స్పష్టం చేసిన‌ట్టు తెలిపారు.

చందాన‌గ‌ర్ స‌ర్కిల్ ఉప‌క‌మిష‌న‌ర్ సుధాంశ్ నంద‌గిరికి ఫిర్యాదు అంద‌జేస్తున్న క‌సిరెడ్డి భాస్క‌ర‌రెడ్డి

గంగారం పెద్ద‌చెరువు, బ‌ఫ‌ర్ జోన్‌ల‌లో…
గంగారం పెద్ద చెరువు బఫర్ జోన్, అలుగుల్లో ఇచ్చిన అనుమతులను రద్దు చేసి సహజ సిద్ధమైన, గొలుసుకట్టు కాలువలను కాపాడాలని జనం కోసం చందానగర్ డిప్యూటీ కమీషనర్ సుధాంశ్ నంద‌గిరికి ఫిర్యాదు చేసింది. చెరువు తూములు పోతే, కింది భాగంలోని కాలనీలు ముంపుకు గురౌతాయని జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కరరెడ్డి డిప్యూటీ కమీషనర్ దృష్టికి తీసుకువ‌చ్చారు. ఆపర్ణ లేక్ బ్రీజ్ డ్రైనేజీ చెరువులోకి వదలడంపై చర్యలు తీసుకోవాలని డీసీని కోరారు.

 

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here