కార్పొరేటర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డికి అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల అభినంద‌న‌లు

చందాన‌గ‌ర్ ‌(న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ కార్పొరేటర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డికి శనివారం అంగన్‌వాడీ టీచర్స్, గంగారం వాసులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాలలో ఏమైనా సమస్యలు ఎదురైతే తమ దృష్టికి తీసుకురావాలని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల నుంచి పిల్లలకు, గర్భిణీ స్త్రీలకు అందించే పౌష్టికాహారంలో ఎటువంటి నిర్లక్ష్యం చేయకూడదని సూచించారు. గంగారం కాలనీలో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో అంగన్‌వాడీ టీచర్స్ ఉమాదేవి, సుజాత, అమృత రాణి, నాగరాణి, ప్రవీణ, గంగారం వాసులు విమల్ కుమార్, అదురుస్తా, వెంకటరమణ, రాఘవేందర్ రావు, శ్రీకాంత్, యాదగిరి, కృష్ణ పాల్గొన్నారు.

కార్పొరేటర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డికి అభినంద‌న‌లు తెలుపుతున్న అంగ‌న్‌వాడీ టీచ‌ర్లు
కార్పొరేటర్ మంజుల ర‌ఘునాథ్ రెడ్డికి శుభాకాంక్ష‌లు తెలిపిన గంగారం వాసులు
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here