మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరి నగర్ కాలనీలో కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించారు. కాలనీలో ఉన్న డ్రైనేజీ, రోడ్డు సమస్యలను పరిశీలించారు. వెంటనే మరమ్మత్తులు చేయాలని అధికారులతో చర్చించారు. సమస్యలను పరిష్కరిస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఈఈ చిన్నారెడ్డి, డీఈ రూపా దేవి, ఏఈ రమేష్, కాలనీవాసులు కిషోర్, విద్యాసాగర్, అశోక్, ఎండీ ఆరిఫ్, నల్లపు రాజు, నరసింహ రాజు, జగన్, సుబ్బరాజు పాల్గొన్నారు.







