చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): పీజేఆర్ స్టేడియంలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి తప్పకుండా కృషి చేస్తానని కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డి పేర్కొన్నారు. చందానగర్ డివిజన్ పరిధిలోని రెడ్డి కాలనీలో ఉన్న కార్పొరేటర్ నివాసంలో శనివారం పీజేఆర్ స్టేడియం బాక్సింగ్ కోచ్ గిరి ఆధ్వర్యంలో బాక్సింగ్ క్రీడాకారులు కార్పొరేటర్ మంజుల రఘునాథ్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు ఆమెకు పుష్ప గుచ్ఛం అందజేసి అభినందనలు తెలిపారు.

అనంతరం ఆమె మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం క్రీడలకు ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందని అన్నారు. క్రీడలు మానసిక ఉల్లాసానికి ఎంతో దోహద పడతాయని అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు రావడానికి క్రీడాకారులు నిరంతరం సాధన చేయాలని అన్నారు. బాక్సింగ్ లో క్రీడాకారులు జాతీయస్థాయిలో రాణించడానికి కృషి చేస్తున్న కోచ్ గిరిని ఆమె అభినందించారు. రోజా బాక్సింగ్ లో రాణిస్తూనే, సమాజ సేవా కార్యక్రమాలు చేయడం గొప్ప విషయమన్నారు. పిల్లలు క్రీడల పట్ల ఆసక్తి కనబరిచే విధంగా తల్లిదండ్రులు ప్రోత్సహించాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో క్రీడాకారులు రోజా, పృథ్వి, ప్రసన్న, సురేష్, వేణు, ప్రణవ్, హర్ష, వరలక్ష్మి, రోహిత్, మహేష్, శేషు, జితేందర్ పాల్గొన్నారు.





