చందానగర్ (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు రంజిత్ రెడ్డి సతీమణి గడ్డం సీతరంజిత్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని శేరిలింగంపల్లి టిఆర్ఎస్ మైనార్టీ నాయకుడు జహీరుద్ధీన్ ఆద్వర్యంలో పలు సేవాకార్యక్రమాలు నిర్వహించారు. నాంపల్లి దర్గా వద్ధ నిరుపేద వృద్ధులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జహీరుద్ధీన్ మాట్లాడుతూ నాటి సీతారాముల స్పూర్తితో నేటి సీతరంజిత్ రెడ్డిలు ప్రజల సేవలో తరిస్తున్నారని, వారిరువురు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో నూరేళ్లు వర్ధిల్లాలని భగవంతున్ని ప్రార్ధిస్తున్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ యూత్ నాయకులు రామ్ కటకం నేత తదితరులు పాల్గొన్నారు.






