మియాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): మియపూర్ డివిజన్ పరిధిలోని మియాపూర్ విలేజ్ మీ సేవ పక్కన మియాపూర్ డివిజన్ మైనారిటీ నాయకుడు మహమ్మద్ ఖాజా నూతనంగా ఏర్పాటు చేసిన ఎంఎస్ బైక్ సర్వీస్ సెంటర్ ను కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ బుధవారం ముఖ్య అతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సీఐ సత్యనారాయణ, డివిజన్ ముఖ్య నాయకులు పురుషోత్తం యాదవ్, గోపరాజు శ్రీనివాస్, కలిదిండి రోజా, బీఎస్ఎన్ కిరణ్ యాదవ్, అన్వర్ షరీఫ్, గంగాధర్, జహంగీర్, స్వామి నాయక్, కృష్ణ నాయక్, సుప్రజ, ఉమ, స్వరూప పాల్గొన్నారు.
హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో పర్యటన..
మియాపూర్ డివిజన్ పరిధిలోని హెచ్ఎంటీ స్వర్ణపురి కాలనీలో సమస్యలపై కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పర్యటించారు. పెండింగ్ లో ఉన్న డ్రైనేజ్ పైప్ లైన్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. అలాగే డ్యామేజ్ అయిన డ్రైనేజీ పైప్‌లైన్లను పరిశీలించి వెంటనే రీ మోడలింగ్ చేసి మరమ్మత్తులు చేయాలని అధికారులను ఆదేశించారు.
మయూరినగర్‌లో…
మియాపూర్ డివిజన్ పరిధిలోని మయూరినగర్ కాలనీలో కొనసాగుతున్న సీసీ రోడ్డు పనులను జీహెచ్ఎంసీ అధికారులతో కలిసి కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ పరిశీలించారు.