టీపీయూఎస్ ఆద్వర్యంలో రక్తదాన శిబిరం

హూడాకాలనీ లో ఘనంగా ఎంపీ రంజిత్ రెడ్డి జన్మదిన వేడుకలు

రక్తదాన శిబిరాన్ని ప్రారంభిస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్సీ రాజేశ్వర్

హఫీజ్ పేట్ (నమస్తే శేరిలింగంపల్లి): చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా హఫీజ్పెట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీ కమ్యూనిటీ హాల్ లో టీపీయూఎస్ శేరిలింగంపల్లి అధ్యక్షులు కంది జ్ఞానేశ్వర్ ఆద్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిబిరాన్ని ఎమ్మెల్సీ రాజేశ్వర్, స్థానిక కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, హమీద్ పటేల్ గారు, సంఘం రాష్ట్ర అధ్యక్షలు శ్రీ గంధం రాములుతో కలిసి ప్రభుత్వ విప్ శ్రీ ఆరేకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ గౌరవ చేవెళ్ల పార్లమెంట్ సభ్యులు శ్రీ డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి జన్మదినం సందర్భంగా ఈ రోజు తెలంగాణ ప్రయివేట్ ఉద్యోగ సంఘం ఆధ్వర్యంలో రక్త నిల్వలను పెంచడానికి రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసుకోవడం చాలా సంతోషకరమని అన్నారు. అదేవిధంగా కరోనా వ్యాధి విస్తరణ నేపథ్యంలో బ్లడ్ బ్యాంక్ నిల్వలు పెంచుకోవడానికి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, మరియు గౌరవ మంత్రి వర్యులు కేటీఆర్, మరియు సైబరాబాద్ సీపీ సజ్జనార్ ల పిలుపు మేరకు రక్తదాన శిబిరాలు ఏర్పటుచేయడం జరిగిందన్నారు.

ర‌క్త‌దాన శిబిరంలో ప‌రీక్ష‌లు చేయించుకుంటున్న ఎమ్మెల్యే ఆరెక‌పూడి గాంధీ

ప్రస్తుతం బ్లడ్‌ బ్యాంకుల్లో రక్తం తగ్గిపోతుండడంతో తలసేమియా, ఇతరత్రా వ్యాధిగ్రస్తులకు రక్తం ఉపయోగపడుతుందని, రక్త దాతలు ముందుకు వచ్చి రక్తదానం చేయడం చాలా గొప్ప విషయమని, అన్ని దానంల కన్న రక్త దానం గొప్పది అని, రక్తదానం చేద్ధాం ఇతరుల ప్రాణాలు కాపాడుదాని ప్రభుత్వ విప్ గాంధీ గారు పేర్కొన్నారు. ప్రమాదం జరిగినప్పుడు, ప్రసవ సమయంలో, అనారోగ్యం పాలైనప్పుడు రక్తం అవసరం చాలా ఉంటుందన్నారు. రక్తదానం చేయడం వలన మనిషి ఆరోగ్యంగా ఉంటారని, ఆరోగ్యంగా ఉన్న వారు ఎన్ని సార్లు రక్తదానం చేసినా ఆరోగ్యంగా ఉంటారని అన్నారు. ఎవరు కూడా భయపడకుండా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. రక్తదానం చేసి ఆపదలో ఉన్న వారిని ఆదుకోవాలని కోరారు. యువతలో స్పూర్తిని నింపేలా రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసిన TPUS ప్రతినిధులను ప్రభుత్వ విప్ గాంధీ ప్రత్యేకంగా అభినందించారు. రక్తదానం చేయడానికి ముందుకు వచ్చిన దాతలను ప్రత్యేకంగా అభినదించడం జరిగినది. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు వి.జగదీశ్వర్ గౌడ్, బొబ్బ నవతారెడ్డి, టీఆర్ఎస్ హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు గౌతమ్ గౌడ్, మియాపూర్ డివిజన్ అధ్యక్షులు ఉప్పలపాటి శ్రీకాంత్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస సీనియర్ నాయకులు మిరియాల రాఘవరావు, వాలా హరీష్ , లాక్ష్మా రెడ్డి, దాసరి గోపికృష్ణ, గోపారాజు శ్రీనివాస్, చాంద్ పాషా, PY రమేష్, భాను ప్రకాష్, కలిదిండి రోజా, శ్రావణి రెడ్డి, ఆనంద్, రాము, జహీర్ తదితరులు పాల్గొన్నారు.

రక్తదాతలకు ప్రశంసా పత్రాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్ గాంధీ, ఎమ్మెల్సీ రాజేశ్వర్, టీపీయూఎస్ నేతలు గంధం రాములు, కంది జ్ఞానేశ్వర్
Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here