శేరిలింగంపల్లి, అక్టోబర్ 31 (నమస్తే శేరిలింగంపల్లి): మాదాపూర్ శిల్పారామంలో వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా శనివారం నిర్వహించిన భరతనాట్య ప్రదర్శన ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. పూజిత బంధువుల శిష్య బృందం ప్రదర్శించిన శాస్త్రీయ నృత్యాలు కళాభిమానులను అలరించాయి. ఈ కార్యక్రమంలో కళాకారులు విహంగా, వైష్ణవి, తనస్వి, భవిష్య, నిహిత, రుద్రాక్ష, దితి, కృతి, శరణ్య, శ్రీనిక తదితరులు తమ నృత్య ప్రతిభను ప్రదర్శించారు. పుష్పాంజలి, నర్తనం, శ్లోకాలు, జతిస్వరం, నటేశ కౌతం, రంగపూజ, శబ్దం, శ్యామలే మీనాక్షి, పంచమూర్తి కౌతం, వలజి తిల్లాన, భో శంభో, మంగళం వంటి వివిధ అంశాలను అద్భుతంగా ప్రదర్శించి ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్నారు.

శాస్త్రీయ నృత్య కళను ప్రోత్సహించడంతో పాటు యువ కళాకారుల్లో ప్రతిభను వెలికితీసే లక్ష్యంతో శిల్పారామం నిర్వహిస్తున్న వారాంతపు సాంస్కృతిక కార్యక్రమాలు కళాభిమానులను ఆకట్టుకుంటున్నాయి.






