చందానగర్ అంగన్‌వాడీ కేంద్రానికి గ్యాస్ స్టవ్ ను అందజేసిన పారునంది శ్రీకాంత్

శేరిలింగంప‌ల్లి, ఆగ‌స్టు 5 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని ఇందిరా నగర్ అంగన్‌వాడీ కేంద్రంలో చిన్నారులకు భోజన సదుపాయాల కల్పనలో ఇబ్బందులు ఉన్నాయని తెలుసుకున్న బీఆర్ఎస్ నాయకుడు పారునంది శ్రీకాంత్ స్పందించారు. సమస్య పరిష్కారంలో భాగంగా అంగన్‌వాడీ కేంద్రానికి గ్యాస్ స్టవ్‌ను అందజేశారు. ఈ సందర్భంగా శ్రీకాంత్ మాట్లాడుతూ చిన్నారులకు మెరుగైన వసతులు కల్పించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని అన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్లేష్ యాదవ్, దొంతి చిన్న, ఎండీ ముజాయిద్, ఉపేందర్, ఎండీ అఫ్స‌ర్, ప్రతాప్ రజక్, షరీఫ్, గిరి, కృష్ణతో పాటు కాలనీవాసులు, స్థానిక ఓటర్లు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here