శేరిలింగంపల్లి, జూన్ 30 (నమస్తే శేరిలింగంపల్లి): మియాపూర్ డివిజన్ పరిధిలోని ముజఫర్ అహ్మద్ నగర్ కాలనీలో చేపట్టిన నూతన సీసీ రోడ్డు నిర్మాణ పనులను మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ కాలనీ వాసులతో కలిసి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముజఫర్ అహ్మద్ నగర్ కాలనీలో మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తున్నామని తెలిపారు. సీసీ రోడ్ల నిర్మాణం నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా జరగాలని, పనుల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ ఉండకూడదని అధికారులకు సూచించారు. డివిజన్ ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించేందుకు శాయశక్తులా కృషి చేస్తానని, పరిశుభ్రమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని అందించే దిశగా చర్యలు తీసుకుంటామని చెప్పారు. నిర్మాణ పనులను జాప్యం లేకుండా త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆదేశించారు.

పీఏసీ చైర్మన్ ఆరెకపూడి గాంధీ సహకారంతో మియాపూర్ డివిజన్ సమగ్ర అభివృద్ధికి కృషి చేస్తానని, ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటానని ఉప్పలపాటి శ్రీకాంత్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ వాసులు అనిల్, కృష్ణారావు, విజయ్ ముదిరాజ్, రాజు గౌడ్, నరసింహ గౌడ్, జంగం మల్లేష్, శివ ముదిరాజ్, పండు బోయ, రాము, జంగం సంతోష్, వంశీవర్ధన్ తదితరులు పాల్గొన్నారు.





