శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): పరీక్షల కారణంగా మానసిక ఒత్తిడికి గురైన ఓ విద్యార్థిని ఆత్మహత్యకు పాల్పడి మృతి చెందిన సంఘటన మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన ప్రకారం.. సూర్యాపేట జిల్లా కోదాడ మండలానికి చెందిన గోపిరెడ్డి కుమార్తె మద్దెపు పూజా రెడ్డి (16) మాదాపూర్‌లోని శ్రీ చైతన్య జూనియర్ కాలేజీలో ఎంపీసీ మొదటి సంవత్సరం విద్యను అభ్యసిస్తోంది. మంగళవారం రాత్రి 8:30 గంటల సమయంలో రూమ్‌లో ఎవరూ లేని సమయంలో ఆమె సీలింగ్ ఫ్యాన్‌కు చున్నీతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ మేరకు సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా హాస్పిటల్‌కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.






