శేరిలింగంపల్లి, మే 14 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు రఘునాథ్ యాదవ్ ను తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించిన సందర్భంగా బిసి ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ సన్మానం చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. రఘునాథ్ యాదవ్ కాంగ్రెస్ సీనియర్ నాయకుడు కావడం, పార్టీ గెలుపు కోసం కృషి చేసిన సందర్భంగా ఆయన సేవలను గుర్తించి కాంగ్రెస్ ప్రభుత్వం యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా నియమించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ తో పాటు అందెల కుమార్ యాదవ్, సెక్రటరీ హరికృష్ణ చారి, శ్రీనివాస్ యాదవ్, శివ యాదవ్, రమేష్, బీసీ ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న ముదిరాజ్ పాల్గొన్నారు.






