శేరిలింగంపల్లి, జూలై 12 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్‌లోని జనప్రియ అపార్టుమెంట్స్ ఫేజ్-5లో కాలనీ అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసుల అభ్యర్థన మేరకు యువనాయకుడు ధాత్రీనాథ్ గౌడ్ ఆధ్వర్యంలోని NMG సేవా ట్రస్ట్ ద్వారా 22 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఏర్పాటు చేసిన సీసీ కెమెరాలను ఆదివారం కాలనీ అసోసియేషన్ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, అసోసియేషన్ సభ్యులు, కాలనీవాసులతో కలిసి ధాత్రీనాథ్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కాలనీలో భద్రతను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. కాలనీవాసుల భద్రతకు ఈ చర్య ఎంతగానో ఉపయోగపడుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు శేఖర్ రెడ్డి, రామకృష్ణారావు, రవి, బాబీ నాయుడు, రామాంజనేయులు, రమాదేవి, సత్యవతి, కళ్యాణి తదితరులు పాల్గొన్నారు.






