శేరిలింగంపల్లి, మే 12 (నమస్తే శేరిలింగంపల్లి): యాదవ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన మారబోయిన రఘునాథ్ యాదవ్ కి శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు బలరామ్ యాదవ్ శుభాకాంక్షలు తెలియజేశారు. రఘునాథ్ యాదవ్‌ను ఆయన నివాసంలో కలిసిన బలరాం యాదవ్ ఆయనకు పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.






