శేరిలింగంపల్లి, మే 7 (నమస్తే శేరిలింగంపల్లి): తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్గా నియమితులైన కూకట్పల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జ్, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ బండి రమేష్ ని, తెలంగాణ కమ్మ కార్పొరేషన్ వైస్ చైర్మన్గా నియమితులైన పరుచూరి మురళిని కమ్మ సంఘం నాయకులు బొడ్డు రవిశంకర్, గంగవరపు ప్రసాద్, కలగర శ్రీను, కండెపనేని రత్నాకర్, యలమంచి ఉదయ్ కిరణ్ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకుడు, చైర్మన్ యలమంచి ఉదయ్ కిరణ్, సుబ్బారావు, గాదె శివ చౌదరి, కొల్లి అనిల్, తులసి, ఇందిరా, చంద్రశేఖర్, నరేష్, సతీష్, కామినేని శ్రీనివాసు, రత్నాచారి, ఇతర సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ బండి రమేష్, పరుచూరి మురళి సమాజ సేవా దృక్పథంతో ప్రజలకు మరింత చేరువై, తెలంగాణ కమ్మ సమాజ అభివృద్ధి, సంక్షేమానికి విశేష సేవలు అందిస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

గౌరవ సూచకంగా నాయకులను శాలువాతో సన్మానించి, పుష్పగుచ్ఛాలు అందజేశారు. అదేవిధంగా అభివృద్ధి, పచ్చదనం, సామాజిక బాధ్యతకు ప్రతీకగా మొక్కలను బహుకరించి ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఆత్మీయ వాతావరణంలో జరిగిన ఈ సమావేశంలో నాయకుల సేవా స్పూర్తి, ప్రజల పట్ల ఉన్న అంకితభావాన్ని సభ్యులు ప్రశంసించారు. ఈ సందర్భంగా బండి రమేష్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి తెలంగాణ కమ్మ కార్పొరేషన్ చైర్మన్ బాధ్యతలు అప్పగించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ కి, మంత్రి తుమ్మల నాగేశ్వర రావు, ఏఐసీసీ కార్యదర్శి జెట్టి కుసుమ కుమార్, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరికి హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.సమాజ అభ్యున్నతికి కట్టుబడి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా తమ బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తామని పేర్కొన్నారు.





