బీసీలు మౌనంగా ఉండే ప‌రిస్థితిలో లేరు: బీసీ సంఘాల నాయ‌కులు

శేరిలింగంప‌ల్లి, మే 7 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్‌లో బీసీ ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 10న హైదరాబాద్ కు రానున్న ప్రధాని మోదీకి బీసీల హక్కుల కోసం ప్రధానికి బహిరంగ లేఖ అనే అంశంపై జరిగిన విలేకరుల సమావేశానికి బీసీ పొలిటికల్ ఫ్రెంట్ రాష్ట్ర కన్వీనర్ అయిలి వెంకన్న గౌడ్ అధ్యక్షత వ‌హించారు. ముఖ్య అతిథులుగా మాజీ ఐఏఎస్, బీసీ ఇంటలెక్చువల్ ఫోరం చైర్మన్ టి చిరంజీవులు, బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగౌని బాలరాజ్ గౌడ్ పాల్గొని మాట్లాడారు. ఈ దేశంలో బీసీలు ఇక మౌనంగా ఉండే పరిస్థితిలో లేర‌ని, తమ హక్కుల కోసం, రాజ్యాంగబద్ధమైన వాటా కోసం, రాజకీయ ప్రాతినిధ్యం కోసం, సామాజిక న్యాయం కోసం ఉద్యమించే దశలో ఉన్నార‌ని అన్నారు. కాంగ్రెస్ పార్టీ కామారెడ్డి డిక్లరేషన్‌లో చట్టసభల్లో బీసీలకు 32 శాతం రిజర్వేషన్లు ఇస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేద‌ని, రాష్ట్ర అసెంబ్లీలో ఆమోదించిన బీసీ రిజర్వేషన్ బిల్లు రాష్ట్రపతి వద్ద పెండింగ్‌లో ఉంద‌ని అన్నారు. మరో బిల్లు గవర్నర్ వద్ద పెండింగ్‌లో ఉంద‌ని అన్నారు. ఈ కార్య‌క్ర‌మంలో ఇంటలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ నాయకులు అంబాల నారాయణ గౌడ్ , బైరు శేఖర్ , ఎర్రమాదు వెంకన్న నేత , సింగం నాగేశ్వర్ గౌడ్ , చెన్నా శ్రీకాంత్ నేత , నరేందర్ నేత, నరేష్, బసవరాజ్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here