శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): అట్టేపల్లి రామప్రభు పటేల్, అట్టేపల్లి పురుషోత్తం పటేల్‌ల మాతృమూర్తి అట్టేపల్లి ప్రమీల పటేల్ చిత్రపటానికి మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పుట్టం పురుషోత్తమ రావు పటేల్ ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె సేవలను, వ్యక్తిత్వాన్ని స్మరించుకుంటూ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ నివాళి కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు పర్వత సతీష్ పటేల్, రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి నాగిశెట్టి ప్రసాద్ పటేల్, రాష్ట్ర మున్నూరు కాపు మాసపత్రిక ఎడిటర్ కోలా జనార్దన్ పటేల్, రాష్ట్ర నాయకుడు కొండారుపు యాదగిరి పటేల్ తదితరులు పాల్గొని అట్టేపల్లి ప్రమీల పటేల్ చిత్రపటానికి పుష్పాంజలి ఘటించి ఘన నివాళులు అర్పించారు.






