శేరిలింగంపల్లి, జూలై 10 (నమస్తే శేరిలింగంపల్లి): నిర్వహణ పనుల కారణంగా శనివారం (జూలై 11) హైదర్‌నగర్ విద్యుత్ విభాగం పరిధిలోని పలు ప్రాంతాల్లో నిర్ణీత సమయాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు హైదర్‌నగర్ ఏఈ (ఆపరేషన్) ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10.00 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు మయూరి నగర్ సబ్‌స్టేషన్ పరిధిలోని11 కేవీ సాయినాథ్ నగర్ ఫీడర్ ద్వారా సరఫరా అయ్యే సాయినాథ్ నగర్, ప్రశాంత్ నగర్, ఇందిరమ్మ కాలనీ ఫేజ్-2, సెట్‌విన్ కాలనీల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. మధ్యాహ్నం 2.00 గంటల నుంచి సాయంత్రం 4.30 గంటల వరకు మయూరి నగర్ సబ్‌స్టేషన్‌లోని 11 కేవీ రామ్ నరేష్ నగర్ ఓహెచ్ ఫీడర్ పరిధిలోని మిత్రా హిల్స్, ప్రశాంత్ నగర్, ఏఎస్ రాజు నగర్, ఓల్డ్ ఏజ్ హోమ్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా ఉండదు.
మధ్యాహ్నం 12.00 గంటల నుంచి 12.30 గంటల వరకు11 కేవీ మయూరి నగర్ ఫీడర్ పరిధిలోని మయూరి నగర్, ఎస్‌బీఐ బ్యాంక్ రోడ్, ఓల్డ్ ఏజ్ హోమ్, కొరుకొండ స్కూల్ పరిసరాల్లో విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నారు. ఉదయం 10.30 గంటల నుంచి 11.00 గంటల వరకు11 కేవీ లక్ష్మీనగర్ ఫీడర్ పరిధిలోని దోవా కాలనీ, లక్ష్మీనగర్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పరిసరాలు, నరేన్ గార్డెన్, నమహా అపార్ట్‌మెంట్, బుద్ధా అపార్ట్‌మెంట్స్ ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోనుంది. అదే సమయంలో మియాపూర్ ఎక్స్‌రోడ్ సబ్‌స్టేషన్ పరిధిలోని 11 కేవీ శ్రీలా గార్డెన్స్ ఫీడర్ ద్వారా సరఫరా అయ్యే శ్రీలా గార్డెన్స్, నడిగడ్డ తండా, సుభాష్ చంద్రబోస్ నగర్, హైటెన్షన్ లైన్ రోడ్డు ప్రాంతాల్లో కూడా విద్యుత్ సరఫరా నిలిపివేయనున్నట్లు అధికారులు తెలిపారు. నిర్వహణ పనులను దృష్టిలో ఉంచుకుని వినియోగదారులు ముందస్తుగా అవసరమైన ఏర్పాట్లు చేసుకోవాలని విద్యుత్ శాఖ అధికారులు కోరారు.





