ప్ర‌ధాని మోదీ బహిరంగ సభను విజయవంతం చేయాలి: డా. కాసం వెంకటేశ్వర్లు

శేరిలింగంపల్లి, మే 5 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హైదరాబాద్‌లో మే 10న పరేడ్ గ్రౌండ్స్ లో నిర్వహించనున్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని రంగారెడ్డి అర్బన్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిపాల్ రెడ్డి ఆధ్వర్యంలో శేరిలింగంపల్లి అసెంబ్లీ ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు డా. కాసం వెంకటేశ్వర్లు ముఖ్యఅతిథిగా హాజ‌రై నరేంద్ర మోడీ బహిరంగ సభను విజయవంతం చేయ‌డంపై నాయకులకు దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రవి కుమార్ యాదవ్, రాష్ట్ర నాయకులు అజిత్ సేనాపతి, గోవర్ధన్ గౌడ్, నరేందర్ రెడ్డి, వసంత్ కుమార్ యాదవ్, బుచ్చి రెడ్డితోపాటు జిల్లా పదాధికారులు, డివిజన్ ఇంచార్జ్ లు, డివిజన్ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here