ప్రశాంత్ నగర్ బస్తీ సమస్యలపై డిప్యూటీ క‌మిష‌న‌ర్‌కు విన‌తి

శేరిలింగంపల్లి, మే 5 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం ప‌రిధిలోని మియాపూర్ ప్రశాంత్ నగర్ బస్తీలో నివసిస్తున్న ప్రజల సమస్యలపై తెలంగాణ రాజ్యాధికార పార్టీ (TRP) రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు బండారు రమేష్ యాదవ్, వర్కింగ్ ప్రెసిడెంట్ మింగరి నర్సింగ్ ముదిరాజ్ జిహెచ్ఎంసి మియాపూర్ స‌ర్కిల్‌ డిప్యూటీ కమిషనర్ శశిరేఖ‌ను కలిసి వినతి పత్రం సమర్పించారు. దాదాపు 200 గుడిసెల్లో 37 సంవత్సరాలుగా నివసిస్తున్న ప్రజలకు కనీస మౌలిక వసతులు కూడా అందడం లేదని, త్రాగునీరు, వాడుకునే నీరు, శానిటేషన్, పబ్లిక్ టాయిలెట్లు వంటి ప్రాథమిక అవసరాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ఈ సందర్భంగా బస్తీ వాసులతో కలిసి బీసీ ఐక్యవేదిక రాష్ట్ర‌ అధ్యక్షుడు బేరి రామచందర్ యాదవ్, ఫెడరేషన్ అధ్యక్షుడు ఆర్కే సాయన్న పాల్గొని పేదలకు జరుగుతున్న అన్యాయాలపై తక్షణమే స్పందించాలని కోరారు. ఈ కార్య‌క్ర‌మంలో టీఆర్‌పీ జిల్లా మహిళా అధ్యక్షురాలు బండారు విజయలక్ష్మి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నర్సింగ్ ముదిరాజ్, మహిళా వర్కింగ్ ప్రెసిడెంట్ వాసుకి, జిల్లా నాయకులు, బస్తీ వాసులు యాది, తిరుపతి, నవీన్, నీలవేణి, అనిత, దుర్గమ్మ, లక్ష్మి, రంగమ్మ, నవీన్, తిరుపతి తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here