కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు స‌హాయం అంద‌జేత‌

శేరిలింగంపల్లి, మే 5 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి మండలం పరిధిలోని కొండాపూర్, గచ్చిబౌలి, శేరిలింగంపల్లి, మాదాపూర్, మియాపూర్, హఫీజ్‌పేట్, చందానగర్ , భారతి నగర్(పార్ట్) డివిజన్ల పరిధిలోని పలువురికి కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ పథకాల‌ ద్వారా మంజూరైన రూ.69,08,004 ఆర్థిక సహాయాన్ని 69 మంది లబ్ధిదారులకు మియాపూర్ లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మాజీ కార్పొరేటర్ ఉప్పలపాటి శ్రీకాంత్ తో కలిసి చెక్కుల రూపేణా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ అందజేశారు. ఈ సందర్బంగా గాంధీ మాట్లాడుతూ పేదల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుంద‌ని , ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేదల పక్షపాతి అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, లబ్ధిదారులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here