శేరిలింగంపల్లి, మే 4 (నమస్తే శేరిలింగంపల్లి): మదీనాగూడ డివిజన్ పరిధిలోని నీలిమా గ్రీన్స్ కాలనీ, సమీప అపార్ట్మెంట్ల ప్రజలు చాలా కాలంగా డ్రైనేజీ, వర్షపు నీరు నిల్వ ఉండడం వంటి తీవ్ర సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఈ సమస్యల పరిష్కారానికి సంబంధించి గతంలో శంకుస్థాపన చేసి శిలాఫలకం ఏర్పాటు చేసినప్పటికీ, ఇప్పటివరకు పనులు ప్రారంభం కాకపోవడంతో స్థానికుల్లో ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో హఫీజ్ పేట్ లోని HMWSSB జనరల్ మేనేజర్ కృష్ణని స్థానిక కాలనీ వాసులతో కలిసి బిజెపి రాష్ట్ర నాయకుడు బోయిని మహేష్ యాదవ్ వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీలిమా గ్రీన్స్ కాలనీతోపాటు చుట్టుపక్కల అపార్ట్మెంట్ వాసులను సమన్వయం చేసుకుంటూ వారికి ఉన్న అపోహలను నివృత్తి చేస్తూ డ్రైనేజీ సమస్యని వీలైనంత త్వరలో శాశ్వత పరిష్కారం దిశగా ముందుకు సాగాలని అధికారులకి విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో జనరల్ సెక్రెటరీ రాజు ముదిరాజ్, దేవేందర్, వెంకట్, అమర్ రెడ్డి, మనోజ్ యాదవ్, నవీన్, కాలనీవాసులు రమేష్ కురుమ, సత్యనారాయణ, చేగురి హనుమంత్ గౌడ్, హరి, యమున, లత తదితరులు పాల్గొన్నారు.






