శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయంలో అగ్నిప్రమాదం… కమిషనర్ చాంబర్ దగ్ధం…

శేరిలింగంప‌ల్లి, మే 4 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి జోనల్ కార్యాలయం అగ్నిప్రమాదానికి గురైంది. సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్ కార్యాలయంలో ప్రమాదవశాత్తు మంటలు అంటుకొని  కమిషనర్ చాంబర్ లోని ఫర్నిచర్ పూర్తిగా దగ్ధం అయింది. కార్యాలయం వెనకాల ఉన్న సబ్ స్టేషన్ లో ఏర్పడిన స్పార్క్ వల్ల వెనకాల ఉన్న చెట్లకు అగ్గి రాజుకుంది. విద్యుత్తు తీగలగుండా జోనల్ కార్యాలయంలోకి అగ్ని వ్యాపించినట్టు సిఎంసి సిబ్బంది తెలిపారు. ఈ ప్రమాదం వల్ల ఎలాంటి ప్రాణనష్టం జరుగలేదు. ఆస్తి నష్టం ఎంత అంచనా వేస్తున్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here