శేరిలింగంపల్లి, జూలై 3 (నమస్తే శేరిలింగంపల్లి): హైటెక్ సిటీ డివిజన్ పరిధిలోని గుట్టల బేగంపేట్ లో నిర్వహించిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ కార్యక్రమంలో భాగంగా శేరిలింగంపల్లి బీఆర్ఎస్ నాయకురాలు మమత ఇంటింటికీ తిరుగుతూ ఫామ్ లను పంపిణీ చేశారు. బీఎల్‌వోలతో కలిసి ఆమె ఎస్ఐఆర్ ఫామ్ లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్హులైన ప్రతి ఒక్కరు ఓటరుగా నమోదు చేసుకోవాలని సూచించారు. ప్రజలు తమ ఓటును కాపాడుకోవాలని, జాబితాలో పేరు ఉండేలా చూసుకోవాలని అన్నారు.






