శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని RTC కాలనీలో రూ.25 లక్షల అంచనా వ్యయంతో ఏర్పాటు చేసిన ఓపెన్ జిమ్ ను, పిల్లల కోసం ఏర్పాటు చేసిన ఆటవిడుపు పరికరాలను మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావుతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ ఓపెన్ జిమ్ ద్వారా ఉదయం, సాయంత్రం వాకింగ్ కు వచ్చే పిల్లలు , పెద్దలు , వృద్ధులు జిమ్ చేసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. పిల్లలకు ఆటస్థలం ఏర్పాటు చేయడం జరిగిందని, అందరూ విరివిగా మొక్కలు నాటి పార్కులను సంరక్షించే బాధ్యత తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో నాయకులు ధాత్రి గౌడ్, లక్ష్మారెడ్డి, మిరియాల ప్రీతమ్ , యాదగిరి, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






