శేరిలింగంపల్లి, ఏప్రిల్ 11 (నమస్తే శేరిలింగంపల్లి): చందానగర్ డివిజన్ పరిధిలోని దీప్తి శ్రీ నగర్ లో నెలకొన్న ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మాజీ కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, ఉప్పలపాటి శ్రీకాంత్, సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, ట్రాఫిక్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్బంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ దీప్తి శ్రీ నగర్ కాలనీలో నిత్యం ట్రాఫిక్ సమస్య తో ప్రజలు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారని, ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రోడ్డు విస్తరణకు తీసుకోవాల్సిన చర్యల పై అధికారులతో కలిసి పాదయాత్రగా స్వయంగా వెళ్లి పరిశీలించడం జరిగిందని తెలిపారు. సాఫ్ట్ వేర్ ఉద్యోగులు, పాఠశాలలు, కళాశాలలకు వెళ్లే విద్యార్థులకు, ఉద్యోగులకు, వ్యాపారస్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నాయకులు ప్రసాద్, అక్బర్ ఖాన్, సాజిద్, నరేందర్ బల్లా, ప్రసాద్, కాలనీ వాసులు సీతారామయ్య, పూర్ణచంద్రరావు , చంద్రశేఖర్ , రామారావు, నారాయణ, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






