హిందూ సమ్మేళ‌నాన్ని విజ‌య‌వంతం చేయాలి

శేరిలింగంప‌ల్లి, ఏప్రిల్ 11 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని హఫీజ్‌పేట్ పరిధిలో స్థానిక హిందూ సమ్మేళనం నూతన కమిటీని ఆర్ఎస్ఎస్ ప్రముఖ డాక్టర్ భూషణ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కమిటీకి అధ్యక్షుడిగా ఎం. ఆచార్య, గౌరవాధ్యక్షుడిగా నరహరి పటేల్, కార్యదర్శిగా బోయిని మహేశ్ యాదవ్ నియమితులయ్యారు. గౌరవ సలహాదారుడిగా బాలింగ్ యాదగిరి గౌడ్, సహాయ కార్యదర్శులుగా మనోజ్ యాదవ్, నవీన్, ఉపాధ్యక్షులుగా సాయి, కన‌క‌మామిడి వెంకటేశ్వర్ గౌడ్, వాసు, నరేంద్ర గౌడ్, కోశాధికారిగా కుమ్మరి శ్రీశైలం, సహ కోశాధికారిగా మన్నె వెంకటేష్ నియామ‌కం అయ్యారు. మహిళా సమితి బాధ్యతలను సురేఖ స్వీకరించగా, క్రీడా విభాగానికి వినోద్, కుమ్మరి జితేందర్, కార్యవర్గ సభ్యులుగా గౌతమ్ గౌడ్, రామకృష్ణ పటేల్, నిమ్మల శేఖర్ గౌడ్, ధాత్రినాథ్ గౌడ్, బోయిని వెంకటేష్ యాదవ్, బోయిని కృష్ణ యాదవ్, కుమ్మరి వెంకటేష్, దేవి, మల్లికార్జున్ గౌడ్, అశోక్ నాయి, రవి ముదిరాజ్, విజయ్, కృష్ణ, ప్రవీణ్ ముదిరాజ్, ఆంజనేయులు చౌదరి, నరేష్, రాజా తదితరులను ఎన్నుకున్నారు.

నూతన కమిటీ ఆధ్వర్యంలో రాబోయే మే 2వ తేదీన‌ సాయంత్రం 5 గంటలకు హిందూ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వ‌హించ‌నున్నారు. ఇందుకు గాను విస్తృతంగా ఏర్పాట్లు చేప‌ట్టారు. ఈ కార్యక్రమానికి హఫీజ్‌పేట్ ప్రాంతంలోని హిందువులందరూ పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేయాలని కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here