శేరిలింగంపల్లి, ఏప్రిల్ 9 (నమస్తే శేరిలింగంపల్లి): సివిఆర్ న్యూస్ తెలుగు ఛానల్ కు బిజెపి రాష్ట్ర నాయకులు, జనంకోసం స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు కసిరెడ్డి భాస్కర రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. తనపై ఫేక్ న్యూస్ ప్రసారం చేసి, తన పరువుకు తీవ్ర నష్టం కలిగించారంటూ.. ఈ క్రమంలోనే సివిఆర్ న్యూస్ తెలుగు యాజమాన్యానికి, ఎడిటర్, యాంకర్, రిపోర్టర్ లకు లీగల్ నోటీసులు పంపించినట్టు భాస్కర రెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

శేరిలింగంపల్లి ప్రాంతంలోని ఒక ఫౌండేషన్ నిర్వాహకుడు, మరో సెల్ ఫోన్ స్టోర్స్ యజమానితో కలిసి ఫేక్ ఎల్ఆర్ఎస్ దందా చేస్తున్నారని తప్పుడు ప్రసారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. వెంటనే వీడియో తొలగించి, క్షమాపణలు వ్రాతపూర్వకంగానూ, తమ ఛానల్ ద్వారానూ 7 రోజుల్లో ప్రకటించాలని మరియు 25 లక్షల డిఫమేషన్ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. లేనిచో న్యాయస్థానం ద్వారా కేసు ఎదుర్కోవాల్సి ఉంటుందని ఆయన తన లాయర్ ద్వారా నోటీసులు పంపించినట్లు తెలిపారు. మా పోరాటంలో నష్టపోయిన కొంతమంది చేస్తున్న విషప్రచారంపై మా అభిప్రాయం, వాస్తవాలు తెలుసుకొని ప్రసారం, ప్రచురణ చేయాలని తాము ఎలాంటి తప్పుడు లావాదేవీలు చేసే అవకాశం ఉండదని, మీడియా మిత్రులు గమనించాలని కసిరెడ్డి భాస్కరరెడ్డి సూచించారు.
కింది కథనంను ఖండిస్తూ కసిరెడ్డి భాస్కర రెడ్డి లీగల్ నోటీసు పంపారు





