మాదాపూర్ (నమస్తే శేరిలింగంపల్లి): గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు తెరాస అభ్యర్థులను గెలిపిస్తే హైదరాబాద్ విశ్వనగరంగా మారుతుందని మాదాపూర్ డివిజన్ తెరాస అభ్యర్థి వి.జగదీశ్వర్ గౌడ్ అన్నారు. డివిజన్ పరిధిలోని రాజారాం కాలనీ, ఇజ్జత్ నగర్ ముస్లిం బస్తీలలో ఆయన శుక్రవారం ఇంటింటికీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. కారు గుర్తుకు ఓటు వేసి తనను గెలిపించాలని కోరారు.
ఈ సందర్భంగా జగదీశ్వర్ గౌడ్ మాట్లాడుతూ.. కారు గుర్తుకు ఓటు వేసి హైదరాబాద్‌ను అభివృద్ధి చేసేందుకు సహకరించాలన్నారు. తెరాస గ్రేటర్‌లో అధికారంలోకి వస్తే సీఎం కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధికి పక్కా ప్రణాళికను రూపొందించి కేవలం కొద్ది కాలంలోనే నగరాన్ని విశ్వ నగరంగా మారుస్తారన్నారు. గత 5 ఏళ్లలో మాదాపూర్ లో చేపట్టిన అభివృద్ధి పనులను చూసి ప్రజలు తనకు ఓటు వేయాలని కోరారు. డిసెంబర్ 1న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.