హఫీజ్‌పేట (నమస్తే శేరిలింగంపల్లి): మైనార్టీల సంక్షేమం కోసం టీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తోందని టీఎస్ఈడబ్ల్యూఐడీసీ ఛైర్మన్ నాగేందర్ గౌడ్, హఫీజ్‌పేట డివిజన్ తెరాస అభ్యర్థి పూజిత జగదీశ్వర్ గౌడ్లు అన్నారు. డివిజన్ పరిధిలోని యూత్ కాలనీ, ఓల్డ్ హఫీజ్‌పేటలలో శుక్రవారం వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంఐఎం పార్టీకి చెందిన కార్యకర్తలు వారి సమక్షంలో తెరాసలో చేరారు.
అనంతరం వారు మాట్లాడుతూ.. తెరాస ప్రభుత్వం మైనార్టీల కోసం ఎన్నో సంక్షేమ పథకాలను ప్రవేశ పెడుతుందని అన్నారు. ప్రతిపక్షాలు చెబుతున్నవి కల్లబొల్లి మాటలని అన్నారు. వారి ప్రభుత్వాల హయాంలో గ్రేటర్లో జరిగిన అభివృద్ధి శూన్యమన్నారు. తెరాసకు ఓటు వేస్తేనే బంగారు భవిష్యత్తు ఉంటుందన్నారు.