పోలింగ్ ఏజెంట్ల నియామ‌కానికి నిబంధ‌న‌ల విడుద‌ల

హైద‌రాబాద్‌‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): డిసెంబ‌ర్ 1న జ‌ర‌గ‌నున్న జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల నేప‌థ్యంలో రాష్ట్ర ఎన్నిక‌ల సంఘం పోలింగ్ ఏజెంట్ల నియామ‌కానికి ప‌లు నిబంధ‌న‌ల‌ను విడుద‌ల చేసింది. ఈ మేర‌కు జీహెచ్ఎంసీ ఎన్నిక‌ల అధికారి లోకేష్ కుమార్ శుక్ర‌వారం ఈ నిబంధ‌న‌ల‌ను విడుద‌ల చేశారు. ఆ వివ‌రాలు విధంగా ఉన్నాయి.

* పోలింగ్‌ ఏజెంట్‌ అదే బూత్‌లో ఓటరు కార్డును కలిగి ఉండాల్సి ఉంటుంది.

* పోలింగ్‌ కేంద్రం వద్ద అభ్యర్థి ఒక బ్యానర్ ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు. అభ్యర్థి పేరు, పార్టీ పేరు, ఎన్నికల చిహ్నంతో కూడిన బ్యానర్ ను ఏర్పాటు చేసుకోవ‌చ్చు.

* పోలింగ్‌ ఏజెంట్ల‌ ఏర్పాటు కోసం అధికారుల నుంచి రాతపూర్వకంగా అనుమతి పొందాలి.

* పోలింగ్‌ ఏజెంట్లు అనుమతి పత్రాల‌ను చూపించాల్సి ఉంటుంది.

* పోలింగ్‌ రోజు కేంద్రానికి వంద మీటర్ల పరిధిలో ప్రచారం చేయ‌డాన్ని నిషేధించారు.

* పోలింగ్‌ కేంద్రానికి 100 మీటర్ల‌ పరిధిలో సెల్‌ఫోన్ల‌ను అనుమతించ‌డం లేదు.

* పోలింగ్‌ రోజున అభ్యర్థి వార్డు పరిధిలో ఒక వాహ‌నంలో మాత్ర‌మే తిర‌గ‌వ‌చ్చు.

* అభ్యర్థుల ఏజెంట్లు, కార్యకర్తల వాహనాలకు అనుమతిని నిషేధించారు.

* అభ్యర్థి పేరుతో ఉన్న వాహనాన్ని ఇతరులు వాడ‌కూడ‌దు.

* పోలింగ్‌ రోజున ఓటర్లను వాహనాల ద్వారా తరలించ‌కూడ‌దు. అలా త‌ర‌లిస్తే నేరం అవుతుంది.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here