శేరిలింగంపల్లి, మార్చి 11 (నమస్తే శేరిలింగంపల్లి): హైదర్ నగర్ డివిజన్ పరిధిలోని భీముని కుంట చెరువు అలుగును మాజీ కార్పొరేటర్ నార్నె శ్రీనివాసరావు, GHMC, జలమండలి, ఇరిగేషన్ అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ కాలనీ వాసుల విజ్ఞప్తి మేరకు భీముని కుంట చెరువును పరిశీలించడం జరిగిందని, చెరువును త్వరలోనే సుందర శోభితవనంగా తీర్చిదిద్దుతామని అన్నారు. భీముని కుంట చెరువు ఇన్ లెట్, ఔట్ లెట్ స్ధితిగతులను పరిశీలించడం జరిగిందని, భీమునికుంట చెరువు అలుగును పరిశీలించి , అలుగు వద్ద చెత్త , చెదారం పేరుకుపోవడం వలన నీటి ప్రవాహం సాఫీగా సాగక, మురుగు నీటి వ్యవస్థ తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు అని , అలుగు వద్ద పేరుకుపోయిన చెత్త చెదారం ను వెంటనే జేసీబీ సహాయంతో తొలగించడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ అధికారులు DE నరేందర్, AE సర్వేశ్, జలమడలి అధికారులు DGM శ్రీనివాసరాజు, మేనేజర్ విలియం ప్రకాష్, GHMC అధికారులు DE మౌనిక, వర్క్ ఇన్స్పెక్టర్ మహాదేవ్, నాయకులు, కార్యకర్తలు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు.






