శేరిలింగంపల్లి, జూలై 2 (నమస్తే శేరిలింగంపల్లి): రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ (డీసీసీ) ప్రధాన కార్యదర్శిగా బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డిని పార్టీ అధిష్ఠానం నియమించింది. ఈ సందర్భంగా తనకు అప్పగించిన బాధ్యత పట్ల హర్షం వ్యక్తం చేసిన ఆయన, పార్టీ తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు అంకితభావంతో పనిచేస్తానని తెలిపారు. ఈ సందర్భంగా ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షుడు చల్లా నరసింహా రెడ్డి, శేరిలింగంపల్లి కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి జగదీశ్వర్ గౌడ్తోపాటు తనపై విశ్వాసం ఉంచిన పార్టీ సీనియర్ నాయకత్వానికి బొల్లంపల్లి విజయభాస్కర్ రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు.

రంగారెడ్డి జిల్లా ప్రజల సమస్యల పరిష్కారం, పార్టీ బలోపేతం కోసం నిబద్ధతతో పనిచేస్తానని ఆయన పేర్కొన్నారు. కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు, విలువలను ప్రజల్లోకి మరింత బలంగా తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలు, నాయకులు, శ్రేయోభిలాషులు అందరి ఆశీస్సులు, సహకారం కోరారు.





