గోపన్‌పల్లిలో ఘ‌నంగా శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణం

శేరిలింగంప‌ల్లి, మార్చి 10 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి నియోజకవర్గం నల్లగండ్ల డివిజన్ పరిధిలోని గోపన్‌పల్లి గ్రామంలో శ్రీ రేణుక ఎల్లమ్మ అమ్మవారి కళ్యాణ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యఅతిథిగా శేరిలింగంపల్లి సీనియర్ నాయకుడు, గచ్చిబౌలి మాజీ కార్పొరేటర్ కొమిరిశెట్టి సాయిబాబా కార్యక్రమానికి హాజరయ్యారు. ఆయనకు రాగం జంగయ్య యాదవ్, రాగం హరి శంకర్ యాదవ్, శంకరి రాజు ముదిరాజ్ స్వాగతం ప‌లికారు. అనంతరం కొమిరిశెట్టి సాయిబాబా అమ్మవారిని దర్శించుకుని ఆశీస్సులు పొందారు. ఈ కార్యక్రమంలో పల్లపు సురేందర్, రాజు నాయక్, బల్ల వెంకటేష్ యాదవ్, రమేష్ గౌడ్, టీ.మల్లేష్ యాదవ్, దార్గుపల్లి పరమేశ్, అనిల్ సింగ్, నరేష్ సింగ్, భాస్కర్, బల్ల నరేష్, పల్లపు నర్సింగ్, ఇ.నరసింహ, శాంకరీ శ్రీనివాస్, జి. పరశురాం, జి.రాము తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here