వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలి: PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ

శేరిలింగంపల్లి, మార్చి 4 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని బచ్చుకుంట చెరువు అలుగు నుండి జాతీయ రహదారి NH -65 వరకు రూ. 1 కోటి 92 లక్షల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులను సీనియర్ నాయకుడు రఘునాథ్ రెడ్డి, GHMC ఇంజనీరింగ్ విభాగం అధికారులతో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ పరిశీలించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ వరద నీటి కాలువ‌ నిర్మాణం పనులను నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అన్నారు. నాణ్యత విషయంలో ఎక్కడా రాజీ పడకూడదని, పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులో కి తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో GHMC అధికారులు DE శ్రీదేవి, నాయకులు రఘునాథ్ రెడ్డి, మూర్తి, స్థానిక కాలనీ అసోసియేషన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here