ఆనందాల‌ను పంచుకునే పండుగ హోలీ: ర‌వికుమార్ యాద‌వ్

శేరిలింగంపల్లి, మార్చి 4 (న‌మ‌స్తే శేరిలింగంపల్లి): మసీద్ బండలోని బీజేపీ కార్యాలయంలో మియాపూర్, హఫీజ్ పేట్ డివిజన్ల నాయకులు, మసీద్ బండ గ్రామ మహిళలు, జిహెచ్ఎంసి కార్మికులతో బీజేపీ శేరిలింగంపల్లి అసెంబ్లీ కంటెస్టెడ్ ఎమ్మెల్యే, ఇంఛార్జి రవికుమార్ యాదవ్ హోలీ పండుగ సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఆయ‌న‌ మాట్లాడుతూ వ‌సంత రుతువుకు స్వాగ‌తం ప‌లికే రంగుల సంబ‌రమే హోలీ పండుగ అని అన్నారు. చెడుపై గెలిచిన మంచికి సంకేతమని, స‌మ‌త‌, మ‌మ‌త‌ల‌కు చిహ్నంగా, పేదా – పెద్ద తార‌త‌మ్యాలు లేకుండా, కుల‌మ‌త భేదాలు లేకుండా రంగుల్లో అంతా క‌లిసి పోయి ఆనందాల‌ను పంచుకునే పండుగే హోలీ అని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు రమణయ్య, సత్య నారాయణ రాజు, గణేష్, విష్ణు దత్, రాజు ముదిరాజ్, దేవేందర్ రావు, శ్రీను, శ్రీనివాస్ యాదవ్, రాము, అమర్నాథ్ రెడ్డి, కమలేష్ , నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here