శేరిలింగంపల్లి, మార్చి 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ తారానగర్ లోని శ్రీశ్రీశ్రీ తుల్జాభవాని ఆలయం ఆవరణలో నిరాశ్రయుడైన ఒంటరి వికలాంగుడికి తన సొంత ఖర్చులతో మాజీ కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ వీల్ చైర్ ను అందచేశారు. అంతకుముందు శ్రీశ్రీశ్రీ తుల్జాభవాని అమ్మవారిని దర్శించుకుని రాగం నాగేందర్ యాదవ్ ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. రాగం నాగేందర్ యాదవ్ మాట్లాడుతూ ఒంటరి వృద్ధాప్యంలో అందులోనూ దివ్యాంగుడికి శారీరక ఆరోగ్యం కంటే ముఖ్యంగా ప్రేమ, ఆత్మీయత, ఓపిక, గౌరవం కావాలని అందులో భాగంగా తన వంతు బాధ్యతగా ఎలక్ట్రిక్ ట్రై సైకిల్ వీల్ చైర్ ను అందజేశానని అన్నారు. దివ్యాంగులు ఎవరిపైనా ఆధారపడకుండా స్వతంత్రంగా జీవించాలన్నదే తన ఉద్దేశమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డివిజన్ గౌరవ అధ్యక్షుడు వీరేశం గౌడ్, తుల్జాభవాని ఆలయ ఛైర్మన్ బి.రాజశేఖర్ రెడ్డి, పవన్, నటరాజ్, రేణుక, శిరీష, సత్యనారాయణ, సత్యం, కిరణ్, బాపునగర్ హనుమాన్ యూత్ ప్రెసిడెంట్ రాజ్ కుమార్, అంబేద్కర్ భవన్ జనచైతన్య అసోసియేషన్ ప్రెసిడెంట్ రమేష్, సుధాకర్ రెడ్డి, ముసలయ్య, ప్రవీణ్, సందీప్, పప్పు తదితరులు పాల్గొన్నారు.






