శేరిలింగంపల్లి, మార్చి 1 (నమస్తే శేరిలింగంపల్లి): శేరిలింగంపల్లి డివిజన్ పరిధిలోని మసీదు బండ లో ఉన్న కుడికుంట చెరువు ను Sahe NGO సంస్థ చైర్మన్ కల్పన రమేష్ ఆధ్వర్యంలో ఇన్ఫోసిస్ ఐటీ సంస్థ సౌజన్యంతో చేపడుతున్న సుందరీకరణ, అభివృద్ధి పనులు పూర్తి అయిన సందర్బంగా చెరువును సీనియర్ నాయకుడు మారబోయిన రాజు యాదవ్ తో కలిసి PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ప్రారంభించారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ మాట్లాడుతూ శేరిలింగంపల్లి నియోజకవర్గం లో ని 64 చెరువులను అభివృద్ధి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని తెలిపారు. చెరువుల సుందరీకరణతో స్వచ్చమైన వర్షపు జల సిరులను ఒడిసిపడుదామని అన్నారు. చెరువుల జలకళ తో గ్రామీణ వాతావరణం నెలకొల్పడమే ధ్యేయంగా పనిచేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మారబోయిన రాజు యాదవ్, మాధవరావు ,ప్రసాద్, మల్లేష్ యాదవ్, కోడిచెర్ల రాములు, మల్లేష్, పవన్, మహేష్, కార్యకర్తలు, కాలనీ వాసులు, మహిళలు పాల్గొన్నారు.






