సాయిన‌గ‌ర్ కాల‌నీలో ఇఫ్తార్ విందు

శేరిలింగంప‌ల్లి, ఫిబ్ర‌వ‌రి 28 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): రంజాన్ మాసం పర్వదినంను పురస్కరించుకుని హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని సాయి నగర్ కాలనీ లో నిర్వహించిన దవాత్- ఏ – ఇఫ్తార్ విందు కార్యక్రమంలో PAC చైర్మన్ ఆరెకపూడి గాంధీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా PAC చైర్మన్ గాంధీ మాట్లాడుతూ రంజాన్ మాసం చాలా పవిత్రమైనది అని, రంజాన్ మాసం సందర్భంగా నిష్ఠతో పాటించే ఉపవాస దీక్షలు, దైవ‌ ప్రార్థనలతో సామరస్యం, శాంతి సౌభ్రాతృత్వం వెల్లివిరియాలని ఆకాంక్షించారు. రంజాన్ పర్వదినం ను పురస్కరించుకుని ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వడం చాలా అభినదించదగ్గ విషయం అని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు అక్తర్, మారబోయిన రాజు యాదవ్, ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, దాత్రి నాథ్ గౌడ్, అజార్, సుదేశ్, మల్లేష్ యాదవ్, మల్లేష్ గౌడ్, పవన్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here