శేరిలింగంపల్లి, మార్చి 1 (నమస్తే శేరిలింగంపల్లి): ఆటోలో ప్రయాణించిన ఓ వ్యక్తి మెడలో నుంచి బంగారు గొలుసు, అతని ఫోన్‌ను తస్కరించిన డ్రైవర్‌తోపాటు మరో వ్యక్తిని మియాపూర్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మియాపూర్‌లోని మయూరినగర్ జీఎల్ఆర్ వర్డర్డ్ రెసిడెన్సీలో నివాసం ఉంటున్న అంబటి వినయ్ రాజు జనవరి 13వ తేదీన సాయంత్రం 6 గంటల సమయంలో శుభమ్ సెలబ్రేషన్స్ ఎదురుగా డిమార్ట్ వద్ద తన ఇంటికి వెళ్లేందుకు వేచి చూస్తుండగా అదే సమయంలో అటుగా వచ్చిన ఓ ఆటోలో అతను వెనుక సీట్‌లో కూర్చుని ప్రయాణించాడు. అతను ఇంటికి వెళ్లే సరికి నిద్రలో ఉన్నాడు. అనంతరం లేచి చూసుకోగా మెడలో ఉన్న బంగారు గొలుసుతోపాటు జేబులో ఉన్న ఐఫోన్ కనిపించడం లేదని గమనించాడు. దీంతో వినయ్ రాజు ఆటోడ్రైవర్ తోపాటు తనతో ప్రయాణించిన మరో వ్యక్తిపై పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. నిందితులను అందుకూరి యోగి (20), సంపంగి మణికంఠ (25)గా పోలీసులు గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. ఈ మేరకు పోలీసులు వారి నుంచి 7 గ్రాముల కట్ చేసిన బంగారు గొలుసు, బ్లాక్ కలర్ రాయల్ ఎన్‌ఫీల్డ్ బైక్ (టీఎస్10ఈడీ8504), ఓ సెల్‌ఫోన్, ఆటో (టీఎస్36టీఏ2903)ను స్వాధీనం చేసుకుని వారిని రిమాండ్‌కు తరలించారు.






