ఆర్‌.కృష్ణ‌య్య‌ను ముఖ్య‌మంత్రిని చేయాలి: బేరి రామచంద్ర యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): వికారాబాద్ జిల్లాకు నూతనంగా ఎన్నికైన సర్పంచుల సన్మాన కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య, బీసీ ఐక్యవేదిక తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. వీరితో పాటు తెలంగాణ రాష్ట్ర శాసనమండలి ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ శాసనసభ అధ్యక్షుడు స్వామి గౌడ్, ముదిరాజుల సంఘం చైర్మన్ జ్ఞానేశ్వర్ ముదిరాజ్ పాల్గొన్నారు. ఈ సభలో వికారాబాద్ జిల్లా బీసీ జేఏసీ కన్వీనర్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మాజీ లైబ్రరీ చైర్మన్ గుడిసె లక్ష్మణ్, జిల్లా కో-కన్వీనర్ యాదగిరి యాదవ్, జిల్లా బీసీ ఐక్యవేదిక అధ్యక్షుడు శంకర్ యాదవ్, కో–కన్వీనర్ వెంకట దాస్ యాదవ్, కొంపల్లి మాజీ సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్, ఇంద్రానగర్ మాజీ కౌన్సిలర్ శ్రీనివాస్ గౌడ్, ఉమాశంకర్, పరిగి బీసీ నాయకులు లాల్ కృష్ణ, హనుమంత ముదిరాజ్, బీసీ కమిషన్ మాజీ డైరెక్టర్ శుభప్రద్ పటేల్, ఎనకపల్లి సర్పంచ్ దయాకర్ ముదిరాజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లాలోని వివిధ మండలాలకు చెందిన నూతన సర్పంచులు, ఉప సర్పంచులు, బీసీ సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ సందర్భంగా నూతన సర్పంచులను సన్మానించిన అనంతరం జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య మాట్లాడుతూ, బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించడమే తమ ప్రధాన లక్ష్యమని స్పష్టం చేశారు. దశాబ్దాలుగా బీసీల హక్కుల కోసం పోరాటం కొనసాగిస్తున్నామని, రాజకీయ అధికారం సాధించినప్పుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని అన్నారు. బీసీ ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు బేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ, ఆర్. కృష్ణయ్య 45 సంవత్సరాలుగా బీసీల కోసం అంకితభావంతో పోరాడుతున్న గొప్ప నాయకుడని కొనియాడారు. ఆయన ముఖ్యమంత్రి అయితే బీసీలకు సముచిత స్థానం లభిస్తుందని, వెనుకబడిన వర్గాలు, బహుజనులకు న్యాయం జరుగుతుందని పేర్కొన్నారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో ఎక్కువ మంది బీసీ అభ్యర్థులు గెలిచి ఆర్. కృష్ణయ్యను ముఖ్యమంత్రిగా చేయాలంటూ బీసీ సంఘాలకు పిలుపునిచ్చారు.

బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించాలంటే తప్పనిసరిగా రాజ్యాధికారాన్ని దక్కించుకోవాలని, ఇందుకోసం బీసీ నాయకులు ముందుకు రావాలని ఆయన సూచించారు. రాష్ట్రంలో బీసీల ఉనికిని ఐక్యత ద్వారా చాటాలని, ప్రతి ఎన్నికల్లో బీసీల ప్రాతినిధ్యం పెరుగుతూ ఉండాలని కోరారు. ఈ సభలో ప్రజలు నూతనంగా ఎన్నికైన సర్పంచులకు అభినందనలు తెలిపారు. కార్యక్రమంలో రాగం మల్లికార్జున్ యాదవ్, వికారాబాద్ జిల్లా బీసీ కులాల ఐక్యవేదిక అధ్యక్షుడు శంకర్ కురుమ, వెంకటేష్ కురుమ, దాస్ యాదవ్, రాఘవేందర్ యాదవ్, రమేష్ కురుమ, మహేందర్ యాదవ్, కృష్ణ గౌడ్, రాజు ముదిరాజ్ పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here