డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం: కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంపల్లి డివిజన్ లోని పాపిరెడ్డి కాలనీలో బీరప్ప టెంపుల్ సమీపంలో ఉన్న బస్తీలో నూతనంగా నిర్మాణం చేపడుతున్న డ్రైనేజీ పైప్ లైన్ పనులను కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పరిశీలించారు. కార్పొరేటర్ మాట్లాడుతూ.. డ్రైనేజీ సమస్య నెలకొని ఉందని, మురుగుకాల్వలు సరిగా లేకపోవడం వల్ల ఇళ్ల నుంచి వచ్చే మురుగునీరు, వర్షాల సమయంలో వరదనీరు రోడ్లపై పారుతూ.. తీవ్ర అపరిశుభ్రత నెలకొని ఉండేదని, దీంతో ప్రజలు ఇబ్బంది పడుతుండేవారని, ఇప్పుడు ఆ సమస్యకు శాశ్వత పరిష్కారం చేయనున్నామని శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్ పేర్కొన్నారు.

స్థానికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ప్రత్యేక చొరవ తీసుకొని నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. పనులు నాణ్యతగా చేయాలని అధికారులను ఆదేశించారు. నిర్మాణాన్ని కూడా త్వరగా పూర్తి చేసి అండర్‌గ్రౌండ్‌ డ్రైనేజీ ద్వారా మురుగునీరు, వరద నీరు వెళ్లేలా చేయాలని సూచించారు. ఆ తరువాత సీసీ రోడ్డు నిర్మాణ పనులను సంబంధిత అధికారులతో చర్చించి చేయిస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిహెచ్ఎంసి ఇంజనీరింగ్ విభాగం ఏఈ భాస్కర్, కుమార్, కొండల్ రావు, బస్వరాజ్, నరసింహా రెడ్డి, మాలాద్రి, దానియల్, రాజు, కృష్ణ వేణి, వరలక్ష్మి, వాటర్ వర్క్స్ సిబ్బంది, స్థానికవాసులు తదితరులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here