ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలు సరికావు: చిర్రా రవీందర్ యాదవ్

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 27 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): కాంగ్రెస్ సర్కార్ తీరుపై శేరిలింగంపల్లి యువ నాయకుడు, బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నేత చిర్రా రవీందర్ యాదవ్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలు సరికావు అని సూచించారు. సిట్ విచారణ పేరుతో వేధింపులకు దిగుతున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీని చూసి కాంగ్రెస్ నేతలకు భయం పట్టుకుందన్నారు. అందుకే కుట్రలు పన్ని కేసులతో ఇబ్బందులు పెట్టాలని చూస్తున్నారని చిర్రా రవీందర్ యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆధారాలు చూపే దమ్ములేక డైలీ సీరియల్ లా నడిపిస్తున్నారని మండిపడ్డారు. మంగళవారం నాడు సిట్ విచారణకు హాజరయ్యేదుకు వెళ్తున్న మాజీ ఎంపీ జోగినపల్లి సంతోష్ రావును కలిసి చిర్రా రవీందర్ యాదవ్ సంఘీభావం తెలిపారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్ సర్కార్ తీరును నిలదీశారు. మున్సిపల్ ఎన్నికల్లో ప్రజలు తగిన బుద్ధి చెబుతారు అని వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీకి మున్సిపల్ ఎన్నికల్లో ఓటమి తప్పదని, అందుకే ప్రతిపక్ష నేతలపై కేసులు పెట్టి గెలవాలని చూస్తోంది అన్నారు. కాంగ్రెస్ పార్టీ ఎన్ని కుట్రలు పన్నినా బీఆర్ఎస్ పార్టీ విజయాన్ని ఆపలేరు అని చిర్రా రవీందర్ యాదవ్ స్పష్టం చేశారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here