అన్ని వ‌ర్గాల మ‌ద్ద‌తు తెరాస‌కే : జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

మాదాపూర్‌‌ (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో అన్ని వర్గాల ప్రజలు టీఆర్‌ఎస్‌కే మద్దతుగా నిలుస్తున్నారని మాదాపూర్ డివిజ‌న్ తెరాస అభ్య‌ర్థి వి.జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్‌, డివిజ‌న్ తెరాస అధ్య‌క్షుడు ఎర్ర‌గుడ్ల శ్రీ‌నివాస్ యాద‌వ్ అన్నారు. డివిజ‌న్ ప‌రిధిలోని చంద్ర‌నాయ‌క్ తండాలో వారు బుధ‌వారం ఇంటింటికీ ప్ర‌చారం నిర్వ‌హించారు.

ఎన్నిక‌ల ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
బ‌స్తీ వాసుల‌తో మాట్లాడుతున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్
స్థానికుల‌తో క‌లిసి ప్ర‌చారం నిర్వ‌హిస్తున్న జ‌గ‌దీశ్వ‌ర్ గౌడ్

ఈ సంద‌ర్భంగా వారు మాట్లాడుతూ.. కారు గుర్తుకు ప్ర‌జ‌లు ఓటు వేసి గెలిపించాల‌న్నారు. డివిజ‌న్ అభివృద్ధి చెందాలంటే కారు గుర్తుకే ఓటు వేయాల‌న్నారు. మాదాపూర్ డివిజన్ అభివృద్ధికి ఎల్లవేళలా కృషి చేస్తామ‌న్నారు. కేసీఆర్ నాయకత్వంలోనే హైదరాబాద్ అభివృద్ధి సాధ్యమని అన్నారు. అన్నివర్గాల సంక్షేమానికి సీఎం కేసీఆర్ నిరంతరం శ్రమిస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో డివిజన్ తెరాస ఉపాధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here