మియాపూర్(నమస్తే శేరిలింగంపల్లి): జిహెచ్ఎంసి ఎన్నికల్లో టిఆర్ఎస్ పార్టీని ఓడించి అవినీతి పాలనకు చరమగీతం పడాలని బీజేపీ మియాపూర్ డివిజన్ అభ్యర్థి కర్లపూడి రాఘవేందర్ కోరారు. బుధవారం ఎన్నికల ప్రచారంలో భాగంగా డివిజన్ పరిధిలోని న్యూ కాలనీ, లక్ష్మి నగర్ లలో పాదయాత్ర నిర్వహించారు.

ఈ సందర్భంగా రాఘవేందర్ రావు మాట్లాడుతూ రోజురోజుకి ప్రజలనుంచి భారతీయ జనతా పార్టీకి అపూర్వ స్పందన లభిస్తుందని తెలిపారు. హైదరాబాద్ ని అభివృద్ధి చేశామని చెప్పుకుంటున్న టిర్ఎస్ పార్టీ వ్యవస్థలను నిర్వీర్యం చేసి నిద్రావస్థలో ఉంచిందన్నారు. అభివృద్ధి మాటలలో తప్ప చేతలలో చూపలేని అసమర్థ ప్రభుత్వానికి బల్దియా ఎన్నికలలో గుణపాఠం చెప్పాలని అయన కోరారు.

బీజేపీ శ్రేణులు రెట్టించిన ఉత్సాహంతో ముందుకు పోవడం మంచి సంతోషకరమని, కమలానికి ఓటు వేసి అభివృద్ధి లో భాగస్వాములు కావాలని ఆయన ప్రజలను అభ్యర్ధించారు