హుడా కాల‌నీలో ఉచిత డ‌యాబెటిస్ వైద్య శిబిరం

శేరిలింగంప‌ల్లి, జ‌న‌వ‌రి 25 (న‌మ‌స్తే శేరిలింగంప‌ల్లి): శేరిలింగంప‌ల్లిలోని చందాన‌గ‌ర్ హుడా కాల‌నీ గ‌ణేష్ ఉత్స‌వ క‌మిటీ ఆధ్వ‌ర్యంలో ఉచిత డ‌యాబెటిస్ వైద్య శిబిరాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్లు నిర్వాహ‌కులు ఒక ప్ర‌క‌ట‌న‌లో తెలిపారు. జ‌న‌వ‌రి 26వ తేదీన ఉద‌యం 7.30 నుంచి 11.30 గంట‌ల స‌మ‌యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌నున్న‌ట్లు తెలిపారు. స్థానిక ప్ర‌జ‌ల‌తోపాటు ప‌రిస‌ర ప్రాంతాకు చెందిన ప్ర‌జ‌లు, మ‌ధుమేహ వ్యాధి బాధితులు ఈ కార్య‌క్ర‌మంలో పాల్గొని ఉచిత వైద్య ప‌రీక్ష‌ల‌ను చేయించుకుని శిబిరాన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని కోరారు.

Advertisement

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here